Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైజాగ్ బీచ్ లో బన్నీ భారీ సైకత శిల్పం!

  • ఈ నెల 8వ తేదీన బన్నీ బర్త్ డే 
  • సినిమా నుంచి ఫ్యాన్స్ కి గిఫ్ట్ 
  • బన్నీ కోసం అభిమానుల కొత్త ఆలోచన  
అల్లు అర్జున్ అభిమానులంతా 'నా పేరు సూర్య' సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిలీజ్ లోగా వాళ్లను అలరించాలనే ఉద్దేశంతో, ఆడియో రిలీజ్ కి బన్నీ సన్నాహాలు చేయిస్తున్నాడు. ఈ సినిమా సమయంలో బన్నీ పుట్టినరోజు రావడం అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ నెల 8వ తేదీన ఆయన పుట్టినరోజు.

 ఈ రోజున అభిమానులకు ఆనందాన్ని కలిగించడం కోసం, ఈ సినిమా టీమ్ ఏదో ఒక ఐటమ్ వదిలే ఛాన్స్ వుంది. ఇక బన్నీ అభిమానులు కూడా ఆయన బర్త్ డే రోజున సంథింగ్ స్పెషల్ గా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో, సైకత (ఇసుక) శిల్పం ఆలోచన చేస్తున్నారట. బన్నీ బర్త్ డే నాటికి వైజాగ్ బీచ్ లో ఆయన సైకత శిల్పం ఏర్పాటు చేయాలనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. సైకత శిల్పం తయారీదారులతో సంప్రదింపులు జరుపుతున్నారట.  
allu arjun
anu emmanuel

More Telugu News